గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..
తనకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డును ప్రకటించినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో పుష్ప2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నానని, క్రెడిట్ అంతా డైరక్టర్ సుకుమార్‌దేనని ప్రకటించారు. అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పుడూ తనలో స్పూర్తిని నింపుతాయని పేర్కొన్నారు.