Home Page SliderNational

వెయిట్ లిఫ్టింగ్ ఆమె ప్రాణాలు తీసింది..

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ యస్తిక ఆచార్య (17) ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. కోచ్ సమక్షంలో జిమ్ లో 270 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా, చేతిలో నుంచి జారిన బరువైన రాడ్డు ఆమె మెడపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు రాకుండా క్రీడాకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెయిట్ లిఫ్టింగ్ నిపుణులు సూచిస్తున్నారు.