హోరా హోరీ సెమీస్ వారి వల్లే గెలిచాం..రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ 2025లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి, గర్వంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది టీమిండియా. దీనితో ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకున్నామని భారత్ అభిమానులు సంబరపడుతున్నారు. విరాట్ కోహ్లి, హార్థిక్ పాండ్యాలు సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా విజయం సులభమయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అసీస్ సాధించింది చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం చాలా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. “విరాట్ కోహ్లి ఎన్నో ఏళ్లుగా జట్టును గెలిపిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. శ్రేయస్, కోహ్లి, రాహుల్, పాండ్యాలు కూడా చక్కగా రాణించారు” అని పేర్కొన్నారు. ఆదివారం జరగనున్న ఫైనల్స్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా లేదా, న్యూజిలాండ్‌తో భారత్ ఆడనుంది.