Home Page SliderTelangana

కుటుంబపాలన అంతం.. బీజేపీ పంతం.. డోర్నకల్‌ ప్రచారసభలో ఈటల రాజేందర్

డోర్నకల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. డోర్నకల్ బిజెపి అభ్యర్థి భూక్య సంగీత తరఫున ఎన్నికల ప్రచార నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గూడూరు చేరుకున్న ఈటల రాజేందర్.. గూడూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసింహులపేట వచ్చారు. కుటుంబ పాలన అంతం చేయాలని పంతంతో మన అభ్యర్థి భూక్య సంగీత ఉన్నారన్నారు ఈటల. చావులకు కారణమైన మీరే పరామర్శకు ఎలా వస్తారు. మానుకోట గడ్డమీద అడుగుపెట్టడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డికి అల్టిమేట్ ఇచ్చాం. ఇక్కడ అడుగుపెడితే ఊరుకునేది లేదు అని చెప్పిన బిడ్డను నేను. 13 మంది బిడ్డలు తుపాకీ తూటాలు తగిలి రక్తం మడుగులో గిలగిలా కొట్టుకున్న సందర్భం ఇంకా నేను మర్చిపోలేదన్నారు ఈటల. కరోనా సోకిన మొదటి పేషెంట్ గాంధీ ఆసుపత్రిలో ఉంటే స్వయంగా నేను వెళ్లి ధైర్యం చెప్పి వచ్చానన్నారు. మొన్నటికి మొన్న అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే మేము వచ్చి రైతులకు ధైర్యం చెప్పామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి.. మమ్మల్ని ఆశీర్వదిస్తే ఒక్క గింజ కూడా తరుగు లేకుండా ధాన్యం కొనే బాధ్యత తీసుకుంటామన్నారు. కేసీఆర్ పోతే తరుగు పీడ పోతుందని భరోసా ఇచ్చి వెళ్తున్నానన్నారు ఈటల.

ప్రభుత్వానికి సహకరించి తండాల్లో గుడుంబా బట్టిలన్ని తీసివేసాం.. కానీ వాటి స్థానంలో కేసీఆర్ లిక్కర్ తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారన్నారు ఈటల. 150 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టారు. అర్ధరాత్రి పూట దగ్గు మందు దొరకడం లేదు కానీ కుతిలేస్తే మందు సీసా మాత్రం దొరుకుతుంది. పుస్తెలతాడు కట్టడానికి కల్యాణ లక్ష్మి పేరుతో ఇచ్చే డబ్బులు 2500 కోట్లు అయితే పుస్తెలతాడు తెంచి మద్యం తాగిపించి లాక్కుంటున్న డబ్బులు 40 వేల కోట్లని దుయ్యబట్టారు. బీజేపీ వస్తే పెన్షన్ పోతుందని భయపెడుతున్నారు.. కానీ పోదు సరి కదా ముసలి వాళ్లు ఇద్దరు ఉంటే రెండు పెన్షన్లు ఇస్తామన్నారు. కేసీఆర్ పోతేనే.. భర్త చనిపోయిన వారికి వెంటనే పెన్షన్ వస్తుందని. భర్త వదిలిపెట్టిన వారికి పెన్షన్ వెంటనే ఇస్తామన్నారు. 65 సంవత్సరాల నిండిన వారికి వెంటనే పెన్షన్ ఇస్తామన్న ఈటల… 57 ఏళ్లు దాటిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే జీమ్మేదార్ మాదన్నారు. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయనుకుంటే కేసీఆర్ పాలనలో బతుకులు చిధ్రమయ్యాయన్నారు. రుణమాఫీకి కేసీఆర్ ఇచ్చిన డబ్బులు వడ్డీకి మాత్రమే సరిపోయాయి. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములమ్మి 14 వేల కోట్ల రూపాయలు తెచ్చి ఋణమాఫీ ఇచ్చారు.

కేసీఆర్ మాటలు తీయగా ఉంటాయి. ఆయన మనకోసమే పుట్టాడు. ఆయన మనకోసమే ముఖ్యమంత్రి అయ్యారు అన్నట్టు మాట్లాడుతాడని.. ఆ మాటలు నమ్మొద్దని ఈటల హితవు పలికారు. ఐడీహెచ్ కాలనీలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి.. వాటిని చూపించి మీకు కూడా ఇలాంటి ఇల్లు వస్తాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరినీ బస్సులు పెట్టి తెచ్చి చూపించారని విమర్శించారు. దేశంలో నరేంద్ర మోడీ నాలుగు కోట్ల ఇల్లు కట్టిస్తే..ఇక్కడ మాత్రం ఇల్లు కట్టకుండా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే.. రాకపోవటంతో ముత్యాల శంకర్ రైలుకు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగ నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ అవుతున్నాయనీ , పేపర్లు లీక్ అవుతున్నాయి అని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందన్నారు. కానీ ఆమె ప్రేమ వ్యవహారంతో చనిపోయిందని.. ఆ మరణాన్ని కూడా వాడుకుంటున్న సిగ్గులేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఆరు నెలలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ నింపుతామన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కన్స్ట్రక్షన్ రంగాలలో ఉద్యోగాలు మన పిల్లలకు ఇప్పించే జిమ్మేదార్ తీసుకుంటామన్నారు ఈటల.

ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ.. ఖచ్చితంగా తప్పే వ్యక్తి కేసీఆర్ అని దళిత ముఖ్యమంత్రి ఇస్తానని ఇవ్వలేదన్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు అనేక హామీ ఇచ్చారు. కానీ గిరిజన భూములు గుంజుకోని వారి పొట్ట కొట్టిన వ్యక్తని విమర్శించారు. ఖమ్మం మిర్చి యార్డ్ లో ధర అందడం లేదని రైతులు ధర్నా చేస్తే.. పొల్లు పొల్లు కొట్టి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేస్తామా ఆలోచన చేయాలన్నారు ఈటల. హుజురాబాద్ ఎన్నికల సమయంలో నరకం అంటే ఏంటో ఈ భూమ్మీదనే చూసిన వ్యక్తిని నేను. దళితబంధు, గొల్ల కురుమలకు డబ్బులు, మద్యం ఓటుకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తే హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరానికి ఓటు వేసి నన్ను గెలిపించారన్నారు. ఇత్తు ఒకటి పెడితే చెట్టు ఇంకొకటి మొలుస్తుందా ? కేసీఆర్ ఎలా ఉంటాడో.. రెడ్యానాయక్ కూడా అలానే ఉన్నాడన్నారు. మీ చేతిలో సెల్ఫోన్లో ఉన్నాయి. ఆనాడు కెసిఆర్ ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. రెడ్యానాయక్ ఆయన కూతురు ఏ పార్టీలో ఉన్నారు ఎక్కడికి పోయారు ఏ పార్టీలో ఉన్న ఏ పార్టీలో గెలిచిన అక్కడికి పోతారట. ఎక్కడెక్కడ అయితే బీఆర్ఎస్ పార్టీ గెలవదు అక్కడక్కడ ఇతర పార్టీ నాయకులను తెలుసుకొని గెలిస్తే మా దగ్గర రండి అని కేసీఆర్ బేరం పెడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు.

ఉత్తర భారత దేశంలో పైసలతో ఎన్నికలు నడవవు కానీ కేసీఆర్ అతి తక్కువ కాలంలోని వేలవేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో పేదల హక్కు ఓటును కొనుక్కోవాలని చూస్తున్నారని… అమ్ముకుందామా ఓటును ఓటు నీ హక్కు అది అరిగిపోయేది కరిగిపోయేది కాదు ఓటు నీ ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరించేదన్నారు. అంబేద్కర్ ఓటు హక్కు బుల్లెట్ లాంటిది నీ తలరాతను మార్చేది అని చెప్పారు నీ తలరాత మార్చే సత్తా నీ చేతిలో ఉంది అని మర్చిపోవద్దన్నారు ఈటల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రవారు గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలతో వస్తారని చెప్పారు కానీ వాటిని ఇప్పుడు ఆచరిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఈటల దుయ్యబట్టారు. వెయ్యి రూపాయలకో, రెండు వేల రూపాయలకు మీ ఆత్మను అమ్ముకుంటే ప్రగతిభవన్‌లో మళ్ళీ కూర్చొనేది కేసీఆర్ అన్నారు. ప్రగతిభవంలో కేసీఆర్‌ను కలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ప్రజల కోసం ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలో కూడా పాస్ లేనిదే లోపలికి రానీయడన్నారు ఈటల. మన మీద ప్రేమ లేని మనల్ని గౌరవించని మనల్ని పట్టించుకోని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అవసరమా ఆలోచించాలని ఓటర్లను కోరారు. గిరిజనులు జనాభా 10% లెక్క ప్రకారం రెండు మంత్రి పదవులు రావాలి కానీ లంబాడాలకు మంత్రి పదవి ఇచ్చి ఆదివాసులకు ఇవ్వడం లేదన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు మూడు దక్కాల్సింది 9 మంత్రి పదవులన్నారు. వెలుమలు ఉన్నది 0.6% కానీ 5 మంది మంత్రి పదవులు దక్కాయన్నారు. సగానికి ఎక్కువ ఉన్న బీసీలకు ఉన్న మంత్రి పదవులు రెండు మాత్రమే భారతీయ జనతా పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న కేసీఆర్‌ను ఓడగొట్టి బిజెపికి అధికారమిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మాట ఇస్తే తప్పమని ప్రధాని చెప్పి వెళ్లారు. ప్లాట్ ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఇంత పెద్ద ఎత్త ఎదిగారు నాలుగు ఇళ్లలో పనిచేసి సాదితే బతికిన బిడ్డ నరేంద్ర మోడీకి పిల్లలు లేరు దేశమంతా నా పిల్లలు ఉంటారు కానీ కేసీఆర్ ఆయన కొడుకు కూతురు అల్లుడు, పరివారం కోసం బతుకుతున్నారన్నారు. రాహుల్ గాంధీ.. గెలవని పార్టీకి బిసి ముఖ్యమంత్రి ఇస్తే ఏమొస్తది అని అంటున్నారట మా ఓట్లు మాకు వేసుకునే సత్తా తెలివి మాకు లేదా అని ఈటల ప్రశ్నించారు. మేము అనుకుంటే మీ పీఠాలు కదిలిపోయే కదిలిపోతాయన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అగ్రవర్ణాలకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతున్న చరిత్ర మీది. మన ఓటు మనకు వేసుకుని మన అధికారాన్ని చేతిలో పట్టుకుందామా అడుక్కున్నామా మీరే తేల్చాలన్నారు ఈటల. బీజేపీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన పోతుందని, ప్రజాపాలన వస్తదని చెప్పారు. బతుకుల బాగుపడతాయన్నారు. పెన్షన్లు ఇవ్వాలని రైతుబంధు నివారణ రుణమాఫీ చేయాలన్న అది బిజెపితోనే సాధ్యమన్నారు. తెలంగాణలో తెల్లరేషన్ కార్డులు, మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తామమన్నారు ఈటల. ఏ వ్యక్తి చనిపోయిన ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని అందిస్తామమన్నారు. అధికారం కోసము ముఖ్యమంత్రి పదవి కోసమే కోరడం లేదు మీ బతుకుల్లో మార్పు రావాలని కోరుతున్నాము కన్నీళ్లు పోవాలంటే పేదరికం పోవాలంటే అప్పుల కుప్ప పోవాలంటే ఘనంగా బతకాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. వచ్చే డబ్బు ఎంత, పెట్టే ఖర్చు ఎంత పూర్తి లెక్కలు తెలిసిన వాడిని తానన్నారు ఈటల. సమస్యల పట్ల అవగాహన ఉన్న బిడ్డ సంగీత ఆమె గుర్తు కమలం పువ్వు గుర్తు ఆమెను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నానని పిలుపునిచ్చారు.