పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించాం:కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీపై అసంతృప్తితో ఆ పార్టీకి నిన్న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇవాళ ఆయనతో భేటి అయ్యారు. కాగా పొన్నాలతో భేటి అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాగా ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరతారని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే జనగామ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దానిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు తట్టుకోలేకే పొన్నాల పార్టీ మారుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. కాగా పొన్నాల కాంగ్రెస్ పార్టీలో దాదాపు 45 సంవత్సరాల పాటు పనిచేస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అగౌరవంగా మాట్లడటం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం పొన్నాల పార్టీ మారడంతో తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

