జూరాల నుంచి వాటర్ లీక్?
ప్రతిష్టాత్మక జూరాల ప్రాజెక్ట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. 12 క్రస్ట్ గేట్ల నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు తెలిసింది. 8 క్రస్ట్ గేట్ల మధ్య భారీ ఎత్తున రోప్ డ్యామేజ్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరమ్మతులు నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని బీ.ఆర్.ఎస్,బీజెపి సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు వెలుస్తున్నాయి, తుప్పు పట్టి ఊడిన గేట్ల రబ్బర్లతో సహా కేటిఆర్ యూత్ ఫోర్స్ ఆధారాలతో సహా పోస్ట్ చేశారు. లీకేజీలతో నీరు వృధాగాపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.కాగా జూరాల ప్రాజెక్ట్ భద్రతపై అనుమానాలున్నాయని బీజెపి.ఆందోళన వ్యక్తం చేసింది.

