టీమిండియా కోచ్‌గా లక్ష్మణ్
ఆసియా కప్ ప్రధాన టోర్నీ ఈ నెల 27 న యూఏఈలో జరగనుంది. ఈ క్రమంలో 28న జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. కానీ టిమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో , ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ సమాచారం. ఎన్‌పీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ శ్రీలంక పర్యటనలోనూ కోచ్‌గా సక్సెస్ సాధించాడు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో అతన్ని ఎంపికచేయడం సరైనదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి సహాయక కోచ్ పారిస్ మాంబ్రే టీమిండియాకు ఇన్‌చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. కానీ ఎన్‌పీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను హరారే నుండి యూఏఈకి పంపే విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.