వాలంటీర్ల వ్యవస్థకు చెల్లుచీటి
అధికారంలోకి రాగానే ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని ప్రచార సభల్లో హోరెత్తించిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు ఏకంగా వాలంటీర్ వ్యవస్థనే పాతరేశారు. వాలంటీర్లు ఎవరూ భయపడొద్దని తమ కూటమి అధికారంలోకి రాగానే అందరిని కొనసాగిస్తామని ఆనాడు ప్రచార సభల్లో నొక్కి వక్కాణించిన పవన్ కళ్యాణ్…అధికారంలోకి రాగనే మాట మార్చారు.అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటేనే కదా తాము జీతాలిచ్చేది అంటూ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పవన్ వ్యంగ్యంగా మాట్లాడగా….ఆయన మాటలను స్పూర్తిగా తీసుకుని ప్రస్తుతం జరుగుతున్న మండలి సమావేశాల్లో వైసీపి సభ్యలడిగిన ప్రశ్నోత్తరాలకు సైతం అవే జవాబులిస్తున్నారు కూటమి మంత్రులు. రాష్ట్రంలో వాలంటీర్లు లేరని, 2023 ఆగస్టులో అంతా రాజీనామా చేశారని ,ఉన్నట్లైతే కొనసాగించే వాళ్లం అధ్యక్షా అని అసత్యాలు వల్లె వేశారు.మరి 2023 ఆగస్టులోనే వాలంటీర్లంతా రాజీనామా చేస్తే 2024 మార్చి,ఏప్రిల్ లో జరిగిన సభల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ..వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎందుకు చెప్పారని వైసీపి సభ్యులు ప్రశ్నించారు. సూపర్ సిక్స్ ని చాపచుట్టేసి, ఇలా వాలంటీర్లను కూడా మోసం చేశారని ప్రతిపక్ష వైసీపి గట్టిగా నినదించింది. ఇంతలో సీపిఎస్ గురించి ప్రస్తావించగా….అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు అంటూ ఛైర్మన్ సాక్షాత్తు మంత్రినే వారించడం విశేషం.