విశాఖలో ఉద్రిక్తత..రాస్తారోకో..
విశాఖ ఉక్కు కార్మికులు ఉవ్వెత్తున లేచారు. ఉక్కు పిడికిలి బిగించారు. 1300రోజులకు పైబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని తగ్గించి, కావాలనే ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తున్నారని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, బంద్‌లు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం తమకు మద్దతు ఇస్తామని చెప్తూనే, కేంద్రానికి ఎదురు చెప్పలేకపోతోందంటున్నారు. సమ్మెను ఉధృతం చేస్తామని, విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాలు కలిసి ఈ సమ్మెలను చేస్తున్నారు. న్యాయంగా రాస్తారోకో చేస్తుంటే, పోలీసులను ప్రయోగించి ప్రభుత్వం బలప్రయోగం చేస్తున్నారని నినాదాలు చేస్తున్నారు. తాము విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వమని, ప్రాణాలనిచ్చయినా సాధించుకుంటామని కార్మికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేంద్రం నుంచి అనుకూలంగా ప్రకటన చేయాలని కోరుకుంటున్నారు.