BusinessInternationalNews AlertSportsviral

ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లి, అనుష్కల ప్లాన్              

 ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ముగించగానే తర్వాతి ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు కింగ్ కోహ్లి, అతని భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు. వీరు దుబాయ్ టూర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఎందుకంటే వీరిద్దరూ కలిసి చేసిన వీడియో ఈ విషయాన్ని తెలియజేస్తోంది.  “దుబాయ్, రెడీ ఫర్ ఎ సర్‌ప్రైజ్” అనే ఈ ప్రచారానికి విజిట్ దుబాయ్ (దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) శ్రీకారం చుట్టింది.  భారతదేశపు స్టార్ జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ “విజిట్ దుబాయ్” ప్రచారంలో భాగంగా దుబాయ్ నగరంలో ఆకర్షణీయమైన ప్రదేశాలను పరిచయం చేశారు. వీడియోలో కనిపించే సరదా, సాహసం, ఆహారం, సంగీతం ద్వారా దుబాయ్ నగరాన్ని వారు మరింత భావోద్వేగపూరితంగా చూపిస్తున్నారు.  దుబాయ్‌ను తమ రెండవ ఇల్లుగా భావించే ఈ జంట, నగరంలోని అందాలు, వినోదాన్ని, సాహసానుభవాలను అన్వేషిస్తూ, ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన అనుభూతికి తీసుకెళుతున్నారు.