దురుద్ధేశంతోనే విజయ్‌మాల్యా దేశం నుండి పరారీ
భారత్‌లోని బ్యాంకులను నిలువునా ముంచేసిన కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు విజయ్‌మాల్యా ఉద్దేశ్యపూర్వకంగానే దేశం వదిలి పారిపోయాడని ఆరోపిస్తోంది సీబీఐ. దేశం నుండి పారిపోయే సమయానికి అతనికి అప్పులు తీర్చడానికి సరిపోయే ఆర్థికబలం ఉందని, ఆడబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసుకుని పారిపోయాడని ముంబైలోని హైకోర్టులో వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పేర్కొంది. అప్పులు తీర్చగలిగే శక్తి ఉండి కూడా తీర్చలేదని ఆరోపణలు చేసింది సీబీఐ. కింగ్ ఫిషర్ సంస్థ పేరుతో విమానయాన సంస్థను నడుపుతూ, అమ్మాయిలతో విలాస జీవితం గడిపే విజయమాల్యా క్రికెట్టు బెట్టింగులలో ఐపీఎల్ వేలంలో కూడా పాల్గొనేవాడు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వరంగ బ్యాంకులకు నష్టం కలిగించి, యూరోప్‌కు పారిపోయాడు విజయ్‌మాల్యా.