విజయ్ అన్నను కలవడానికి చాలా టెన్షన్ పడ్డా.. ‘మహారాజ’ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతిని కలిసినప్పటి అనుభవాల్ని పంచుకున్న మహారాజ మూవీ డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మహారాజ. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి ఈ సినిమాని చూసి దర్శకుడిని పిలిచి మరీ ప్రశంసించిన విషయం తెలిసిందే. నేను విజయ్ అన్నని కలవడానికి వెళ్లినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని చూసి ఆయన నవ్వుతూ.. కూల్‌గా ఉండు అన్నారు. సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని ప్రశంసించారు. లియోకు సంబంధించిన విషయాలను కూడా చర్చించుకున్నట్లు తెలిపారు. విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇది వస్తోంది. ఈచిత్రం కోసం సెప్టెంబర్ 5 వరకు వేచి ఉండాలన్నారు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా… స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు.