మహిళ స్నానం చేస్తుండగా వీడియో
పవిత్ర కుంభమేళ కవరేజ్‌కి వెళ్లిన ఓ జర్నలిస్ట్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.ఎంతో ఆధ్మాత్మిక సంరంభం నడుమ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్రపంచ వేడుకను బాధ్యతాయుతంగా ప్రపంచానికి తెలియజెప్పాల్సిన కలంయోధుడు… కత్తికట్టే మాటలతో తాను తీసిన వీడియోని పోస్ట్ చేసి కటకటాలపాలయ్యాడు. యూపీ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఆడవాళ్లు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. కమ్రాన్ అల్వి అనే లోకల్ జర్నలిస్టు ఓ మహిళ నదిలో స్నానం చేస్తుండగా వీడియో తీసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి అసభ్యకరమైన కామెంట్ జోడించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై కేసు పెట్టి, అరెస్టు చేశారు.