Home Page SliderTelangana

నారాయణపేట జిల్లా కలెక్టర్ పై DOPTకి ఫిర్యాదు చేసిన VHP

నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారికి  విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. గత జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసే విషయంలో.. మరియు జాతీయ జెండా ఆవిష్కరణ చేసే విషయంలో అంగన్వాడీ టీచర్ ఎస్తేర్ ప్రవర్తన  భారత జాతి వ్యతిరేకతగా ఉందని ఈ విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి విశ్వహిందూ పరిషత్ నేతలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. వీరితో కలెక్టర్ స్థాయిని మరిచి దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారు. దీనితో మనస్తాపం చెందిన VHPనేతలు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేద్దామనుకుని, ఎంతగానో ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీనితో సంయమనం కోల్పోయిన వీరు కేంద్ర ప్రభుత్వ డి ఓ పి టి మంత్రికి ఫిర్యాదు చేశారు.

‘ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం ఏమాత్రం తగదు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం’ అని వీరు పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, ప్రచార ప్రముఖ్ శ్రీ సురేందర్ రెడ్డి గారు, శ్రీ పండరీనాథ్ గారు, పగుడాకుల బాలస్వామి ఈ లేఖలో సంతకాలు చేశారు. ఒక టీచర్, కలెక్టర్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవులలో ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.