ఆసుపత్రిలో చేరిన వల్లభనేని వంశీ..
వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు పోలీసులు. శ్వాసకోశ సమస్య రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు నివేదిక అందజేశారు జైలు అధికారులు. తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ తెలియజేశారు. తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితునిగా గత నాలుగు నెలలుగా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఆయనకు సత్యవర్థన్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో బెయిల్ దొరికినా, పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్ లభించక పోవడం వల్ల విడుదల కాలేదు.