Home Page SliderNational

పూజాఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్..

మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ ట్రైనీ పూజాఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్ ఇచ్చింది. ఆమెకు భవిష్యత్తులో కూడా ఎలాంటి పరీక్షలు రాసే అవకాశం లేకుండా నిషేధం విధించింది. ఆమెను జీవితకాలం డిబార్ చేసినట్లు ప్రకటించింది. ‘ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్నట్లు’ ఆమె ట్రైనీగా ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు అధికారులను అసహనానికి గురి చేసింది. సివిల్ సర్వీస్ పరీక్ష రాసేందుకు ఆమె ఫేక్ డిజేబిలిటీ, ఓబీసీ సర్టిఫికేట్లను సమర్పించినందుకు ఆమెపై జూలై 19న కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ట్రైనీగా ఉన్నప్పుడే అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో ఆమె దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. దీనిపై సర్వత్రా ఆమెపై కామెంట్లు వెల్లువెత్తాయి. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపైనే అనుమానాలు వ్యక్తం కావడంతో ఇటీవల యూపీఎస్సీ ఛైర్మన్ దీపక్ గుప్తా ఐదేళ్ల సర్వీసు ఉండగానే పదవీ విరమణ చేశారు. నేడు ప్రీతి సుదాన్ యూపీఎస్సీ ఛైర్మన్ పదవిని చేపట్టారు.