అసెంబ్లీలో రచ్చ..11మంది ఎమ్మెల్యేలు సస్పెండ్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నేడు కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అయితే సీఎం రేఖాగుప్తా కార్యాలయంలో అంబేద్కర్ ఫోటో బదులుగా పీఎం నరేంద్ర మోదీ ఫోటో పెట్టారని ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై అసెంబ్లీలో నినాదాలు చేయగా, స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే సమావేశం జరగకుండా ఆటంకం కలిగించడంతో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను సభ నుండి ఒకరోజు సస్పెండ్ చేశారు. వీరిలో మాజీ సీఎం ఆతిశీ కూడా ఉండడం విశేషం.