అన్నవరం దేవస్థానంలో ఇష్టంలేని వివాహం..అడ్డుకున్న భక్తులు
కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని ఆలయ ప్రాంగణంలో సామూహిక వివాహ వేదికలపై జరుగుతున్న ఒక వివాహాన్ని భక్తులు అడ్డుకున్నారు. పెళ్లి పీటలపై ఏడుస్తున్న వధువుని గమనించిన భద్రతా సిబ్బంది, భక్తులు ఆరా తీయగా, 22 ఏళ్ల వయసున్న వధువుకి ఇష్టం లేకుండా 42 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారని తెలిసింది. దీనితో ఆ వివాహ తంతుని అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

