ఎయిడ్స్‌పై UNO కీలక ప్రకటన
ఎయిడ్స్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోందని UNO తన తాజా నివేదికలో తెలిపింది. ఎయిడ్స్‌తో రోజుకొకరు మరణిస్తారని ప్రకటించింది. 2023 సంవత్సరం చివరకు దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని పేర్కొంది. వీరిలో కోటి మందికి పైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని అధ్యయనంలో తేలింది. ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు ముమ్మురం కావల్సిన అవసరం ఉంది. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికా, తూర్పు యూరోప్ దేశాలలో కొత్త అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. 2004లో ఈ వ్యాధితో 21 లక్షల మంది చనిపోయారు. ఐతే భయంకరమైన నిజం ఏంటంటే 2023లో 6.3 లక్షల మంది ఎయిడ్స్‌తో చనిపోయారు. దీనితో ఈ వ్యాధి ఎంతగా వ్యాప్తి చెందుతోందో అర్థం అవుతోంది. దీనిని 2025 నాటికి 2.5 లక్షలకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నారు. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల వల్ల ఎయిడ్స్ తీవ్రరూపం దాల్చుతోంది. 2030 నాటికి ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అంతం చేయాలని ప్రణాళిక రచించగా, 2025 నాటికి కొత్త ఇన్‌ఫెక్షన్లను తగ్గించాలనుకున్నారు. కానీ మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.