యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న యోజిత సాహో (28) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ యోజిత చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయపూర్ కు చెందిందని పోలీసులు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. యోజిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.