వయనాడ్‌లో కేంద్రమంత్రి పర్యటన..భారీ సాయం
వయనాడ్ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 160మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకా వందలమంది మట్టి పెళ్లల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అనేక మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై సమీక్షించడానికి కేంద్రమంత్రి జార్ట్ కురియన్ కేరళకు వచ్చారు. సహాయక శిబిరాలను సందర్శించి, గాయపడిన వారిని పరామర్శించారు. కేంద్రప్రభుత్వం తరపున అన్ని రకాలుగా భారీ సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వయనాడ్ పరిస్థితిని ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు. మిలటరీ, వైమానిక, నావికాదళాల సహకారంతో ప్రజలకు అన్ని విధాల సహాయం చేయాలని పీఎంవో ఆదేశించింది. బెంగళూరు నుండి ఎన్డీఆర్‌ఎఫ్, మద్రాస్ నుండి ఆర్మీ బృందాలు ఇప్పటికే వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.