కేంద్రమంత్రి షాట్‌కు కార్యకర్త తలకు గాయం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇటౌరాలో కొత్తగా ఒక స్టేడియాన్ని నిర్మించింది. క్రికెట్ స్టేడియాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించిన అనంతరం కాసేపు సరదాగా బీజేపీ కార్యకర్తలతో క్రికెట్ ఆడారు.ఈ క్రమంలో సింధియా బ్యాటింగ్ చేస్తుండగా షాట్ కొట్టారు.. కొట్టిన బంతి వికాస్ మిశ్రా అనే బీజేపీ కార్యకర్త తలకు తాకింది. తలకు బంతి బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆటను ఆపేసిన కేంద్రమంత్రి.. మిశ్రాను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడి తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం మిశ్రా ఆరోగ్యం నిలకడగా ఉంది.
