Home Page SliderNational

దేశంలో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఇథనాల్ వాహనాలు

Share with

భారతదేశం క్రమక్రమంగా అభివృద్దిలో కొంత పుంతలు తొక్కుతున్నట్లు కన్పిస్తోంది. కాగా దేశంలో త్వరలోనే 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే దేశంలో మొదటగా హీరో,టీవీఎస్,బజాజ్ కంపెనీలకు చెందిన ఇథనాల్ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కేవలం రూ.15/-లీటర్ లభిస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ మేరకు దేశంలో ఇథనాల్‌తో నడిచే మొట్టమొదటి కారును టయోటా కంపెనీ తయారు చేస్తుందన్నారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో 100% ఇథనాల్‌తో నడిచే కారును టయోటా కంపెనీ విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.