సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఫైర్
సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రధాని మంత్రి ఈ నెల 8న ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాల వివరాలపై మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ అభివృద్ధి పనులు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించనున్నారు. బీబీ నగర్ఎయిమ్స్లో కొత్త బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 11,355 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఎంఎంటీఎస్ 13 కొత్త సర్వీసులను ప్రారంభిస్తారు. సిటీ చుట్టూ ట్రీపుల్ఆర్ ను కూడా తొందరగా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. . కేంద్ర ప్రాజెక్టులకు సహకరించకుండా ఏ ముఖం పెట్టుకుని మంత్రులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు? హైదరాబాద్లో సైన్స్సిటీ, తెలంగాణలో సైనిక్స్కూల్, హైదరాబాద్లో సింగీత్ స్కూలు, కల్చరల్సెంటర్, ఈఎస్సై హాస్పిటల్నిర్మాణం, చర్లపల్లిలో నూతన రైల్వే టర్మినల్ లాంటి ప్రాజెక్టుల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయనిరాకరణే కారణం. ఆయుష్మాన్భారత్ అంతంత మాత్రమే, ఈబీసీ, ట్రైబల్రిజర్వేషన్లు అమలు చేయరు. రాజకీయాలే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఒక్క పెద్ద పల్లి జిల్లా మినహా మిగతా 32 జిల్లాల్లో అన్ని జాతీయ రహదారులను కనెక్ట్ చేసే రోడ్లను డెవలప్ చేసింది.

కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు ఉద్యమకారులు డీజిల్ పోయిస్తే తిరిగిన సీఎం కేసీఆర్.. విపక్ష పార్టీలకు ఫైనాన్స్ చేసేంత డబ్బు ఎలా సంపాదించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి పేరిట తెచ్చిన అప్పుల్లో ఇతర పార్టీలను కొనేందుకు, ఫైనాన్స్ చేసేందుకు ఎంత పోగేశారని ఆయన మండిపడ్డారు. అక్రమంగా దోచుకున్న డబ్బుతో పార్టీలను కొని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని, అది ‘ఉట్టి కెగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురడమేనని’ ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రధాని తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపాం. తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్ళు ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు. సికింద్రాబాద్ బెంగళూరుకు కూడా వందే భారత్ రైలు రావాలని కోరుకుంటున్నాను”అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

