Home Page SliderNational

కర్ణాటక అసెంబ్లీకి ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఈయన కర్ణాటక అసెంబ్లీకి తొలి ముస్లిం స్పీకర్‌గా పనిచేయబోతున్నారు. ఈయన ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మంగుళూరు నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన 23వ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పదవి చేపట్టనున్నారు. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఏకైక వ్యక్తి కావడం విశేషం. గతంలో కూడా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా 2013 నుండి 2016 వరకు సిద్దరామయ్య ప్రభుత్వంలో పనిచేసారు. స్పీకర్‌గా ఖాదర్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉపముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ బలపరిచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించడంతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు.