అత్తమామల వేధింపులు భరించలేక…!
వరకట్న వేధింపులు నిత్యకృత్యమౌతున్నాయి.మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసిన భర్తే కాలయముడిగా మారుతున్నాడు.ధర్మేచ…అర్ధేచ…కామేచ…మోక్షేచ….నాతిచరామి అని ప్రమాణం చేసిన వాడు కట్నం కోసం కసాయిగా మారుతున్నాడు.దీంతో భర్త,అత్తమామల వేధింపులు తాళలేక తనువులు చాలిస్తున్న యువతులు ఇటీవల కాలంలో పెరిగిపోయారు.ఈ నేపథ్యంలో సాక్షాత్తు ఓ మహిళా డాక్టర్ కూడా ఇదే తరహా ఆత్మహత్యకు యత్నించింది.హైదరాబాద్‌లో ఉంటున్న ప్రణీత అనే మహిళా డాక్టర్ పురుగుల మందు సేవించి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది.సెల్ఫీ వీడియోలో వేధింపుల గురించి ప్రస్థావిస్తూ కన్నీటి పర్యంతమైంది. వీడియో చూసిన ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు బద్దలు కొట్టి బాదితురాలిని.. ఆసుపత్రికి తరలించారు.పోలీసులు పరిశీలించారు.