ఏపీలో మెగా డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు
ఏపీ ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ మేరకు రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ఈ మెగా డీఎస్సీని రెండు నోటిఫికేషన్లుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్ ఇవ్వనుంది.కాగా ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారికి నేరుగా మరో నోటిఫికేషన్ విడులద చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 30న ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కన్పిస్తోంది.అలాగే డిసెంబర్ 10 నాటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.


 
							 
							