ఏసీబీ వలలో సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు..
నారాయణపేట జిల్లా మక్తల్ సీఐ చంద్రశేఖర్ తో పాటు కానిస్టేబుళ్లు నరసింహ, శివ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. మహబూబ్ నగర్ కు సంధ్యావెంకటరాములు పై చెందిన గతంలో ఓ కేసు నమోదైంది. అయితే తనకు అనుకూలంగా వేయాలని అతడు పోలీసులను కోరగా అందుకు వారు రూ.20వేల లంచం డిమాండ్ చేశారు. సీఐ ఆదేశాల మేరకు సంధ్యావెంకటరాములు నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

