వరద ప్రవాహంతో పోటెత్తుతున్న తుంగభద్ర జలాశయం
కర్నూల్: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని దాదాపు అన్నీ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. తాజాగా ఈ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాలలోని వరద నీరు క్రమంగా జలాశయాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది.. దీంతో ప్రస్తుతం తుంగభద్రలో ఇన్‌ఫ్లో 98,980 క్యూసెక్కులు,అవుట్‌ఫ్లో 96,272 క్యూసెక్కులు గా ఉంది. అయితే ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,632 అడుగులుగా ఉంది. ఇలా భారీగా వస్తున్న వరదతో తుంగభద్ర జలాశయం నిండుకుండను తలపిస్తోంది.

