టీటీడీకి రూ. 11 కోట్ల భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌కు భారీ విరాళం అందింది. నేడు టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు ముంబయిలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ అనే భక్తుడు రూ.11 కోట్ల డీడీని టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. అన్నప్రసాద ట్రస్ట్‌కు ఇంత భారీగా విరాళం అందించిన తుషార్ కుమార్‌ను ఆయన అభినందించారు.