టీఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంపు
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును టెక్నికల్ బోర్డు సెప్టెంబరు 2వ తేదీ వరకు పెంచింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన గడువు ఈ నెల 30వ తేదీన ముగిసింది. దీంతో ఎంసెట్లో ర్యాంకు సాధించినా.. ఇంటర్లో ఫెయిల్ అయిన వారి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ఎంసెట్లో ర్యాంకు సాధించి.. మంగళవారం విడుదల చేసిన అడ్వాన్స్డ్ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. దీంతో వారి ధ్రువపత్రాల పరిశీలన కోసం గడువును సాంకేతిక విద్యాశాఖ మరో మూడు రోజులు పెంచింది. వెబ్ ఆప్షన్ల గడువును సెప్టెంబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

