Home Page SliderInternationalNewsPolitics

ట్రంప్ విజయంతో మస్క్‌కు రూ.2 లక్షల కోట్లు లాభం

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన ట్రంప్ కారణంగా ఎలాన్‌ మస్క్ సంపద అమాంతం ఒక్కరోజులో రూ.2 లక్షల కోట్లు (26.5 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా నెంబర్ ఒన్ స్థానంలో ఉన్న మస్క్‌కు ఈ విజయం అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కోసం విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ధారాళంగా విరాళాలు అందించారు మస్క్. ఈ ఎన్నికల ఫలితాల కారణంగా మస్క్ సంస్థలకు సంబంధించిన షేర్ల విలువ 290 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వివరించింది.