పుతిన్ ఫోన్ కాల్ కోసం ట్రంప్ గంటసేపు వెయిటింగ్…
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ మాట్లాడడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గంట సేపు పైగా నిరీక్షించిన విషయం వైరల్ అవుతోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చలకు, యుద్ధ ముగింపు కోసం ఈ అగ్రనేతలిద్దరూ ఫోన్‌లో చర్చించారు. అయితే ఫోన్‌లో పుతిన్ అందుబాటులోకి రావడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గంటకు పైగా వెయిట్ చేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో పుతిన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారని సమాచారం.

