crimeHome Page SliderNational

ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు..దోషి ఇతడే

గతేడాది ఆగస్టులో జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అక్కడి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై తీవ్రంగా దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటనపై దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. వైద్యులు విధులు బహిష్కరించి సమ్మెలు చేశారు. సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అనుమానించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు వెలువరిస్తూ అతడిని దోషిగా తేల్చింది. జనవరి 20 సోమవారం నాడు అతనికి శిక్ష ఖరారు చేయనున్నారు.