కవచ్‌తో రైలు ప్రయాణం సురక్షితం
రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొట్టకుండా వాటంతట అవే నిలిచిపోయేలా చేసే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ) వ్యవస్థ ‘కవచ్’ను కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ సిగ్నలింగ్ వ్యవస్థను తయారు చేశారు. గతేడాది దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఈ ఏడాది ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా ప్రాంతాలలో 3 వేల కిలోమీటర్లను ఈ పరిధిలోకి తేవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికోసం 10 వేల లోకోమోటివ్‌ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే రైల్వే రంగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

