NationalNews

పెళ్లి వేడుకలో విషాదం… ఐదుగురు సజీవదహనం  

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో… వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది… ఘటనాస్థలానికి చేరుకొని, మంటలను అదుపుచేసింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.