Home Page SliderNationalNews Alert

ఖుష్బు ఇంట విషాదం

ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. గత కొంత కాలంగా అబ్దుల్లా ఖాన్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  “మీతో కలకాలం ఉండాలని ఎంత కోరుకున్నా. కానీ వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. మీ ప్రేమ ఎప్పుడూ మాతోనే ఉంటాయి. నా సోదరుడు తిరిగి రావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఖుష్బు ఉద్వేగభరితంగా పోస్ట్‌ చేశారు. ఖుష్బుకు అబ్దుల్లా, అబూ బకర్‌, అలీ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. అబ్దుల్లా కొన్ని సినిమాల్లో నటించారు.