Andhra PradeshNewsNews Alert

అమరావతి రైతులకు రాజధానిపై భరోసా

Share with

సీనియర్ బీజేపీ నేత, ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి బిజెపి పాదయాత్రలో ఊహించని షాక్ తగిలింది. ఈరోజు పెనుమాకలో రైతులను కలిసిన ఆయనకు తెలుగుదేశం అభిమాన రైతుల నుండి కొన్ని గడ్డు ప్రశ్నలు ఎదురయ్యాయి. అమరావతికి అన్యాయం జరుగుతోందని, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ముందుకు రావాలని పెనుమాకలో సోము వీర్రాజుని రైతు సాహెబ్ కోరారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం చేశారని, బాబుని విమర్శించవద్దని, చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండాల్సిందని రైతు అన్నారు.  ప్రధాని మోడీ ఏం చేశారని అడుగిన వారికి సోము వీర్రాజు సరైన సమాధానమే ఇచ్చారు. కేంద్ర పథకాలు ప్రజల్లో  వైసీపీ తమవిగా చెప్పుకుంటున్నారనీ నిజాలు దాచి మోసం చేస్తున్నారనీ , మోడీ విజయవాడలో ఐదు పైవంతెనలు కట్టించారని, అమరావతి నుంచి హైవే నిర్మిస్తున్నారని, అమరావతి నుంచి మచిలీపట్నం 4వరుసల రహదారి వేశారని, జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నారనీ పేర్కొన్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్న పనులు కాదా అంటూ ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణం కొంతవరకే జరిగిందని, అమరావతి అభివృద్దికి కేంద్రం కృషి చేస్తోందనీ, జగన్ రాజధాని కడతానన్నాడనీ, కానీ అధికారంలోకి వచ్చాకా మాట మార్చి మూడు రాజధానులని అంటున్నారని చెప్పారు. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నానని చెప్పాడు అదీ జరగలేదు. TDP, YCPలు రెండూ ప్రజలకు న్యాయం చేయలేదనీ, BJP మాత్రమే ప్రజలకు కల్పతరువు లాంటిదనీ, ఇచ్చిన మాట నిలబెట్టుకొనే సత్తా ఉన్న పార్టీ అనీ మోదీ తలచుకుంటే రాజధాని నిర్మాణం ఎంతసేపని అన్నారు.. మన దేశంలో చాలా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా వాటిలో  అమరావతికి ఇచ్చిందే ఎక్కువ అనీ, చత్తీస్ ఘడ్ రాజధాని నిర్మాణం కోసం కేవలం 500 కోట్లు మాత్రమే ఇచ్చారనీ, అమరావతి కోసం   7వేల 500 కోట్లుఖర్చు చేశారనీ, , ఎయిమ్స్ ఆసుపత్రికి 18వందల కోట్లు కేంద్రమే  ఇచ్చిందనీ గుర్తుచేసారు. YCP రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, భూములు కూడా  అభివృద్ధి చేయలేదు అనీ వివరించారు.  రాజధాని నిర్మాణం జరిగితే బీజేపీకి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు దారి మళ్లిస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న డబ్బులు కూడా రాష్ట్రం ఇవ్వటం లేదు.

చంద్రబాబు మోదీతో కలిసి ఉంటే రాజధాని ఎప్పుడో అయిపోయేది అనీ, అనవసరంగా విడిపోయారనీ రాష్ట్రాన్ని మోసకారుల చేతిలో పెట్టారనీ అన్నారు. కలిసి ఉంటే ఇలాంటి దుర్మార్గులకు 150సీట్లు వచ్చేవి కాదనీ, వైసీపీ ప్రభుత్వాన్ని దించి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని తీసుకువచ్చినప్పుడే రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. మేం జగన్ ను రక్షిస్తున్నామని ఓ పెద్దాయన అన్నాడట మేం ఎవరినీ రక్షించటం లేదు. సరైన సమయంలో అన్నీ జరుగుతాయనీ భరోసా ఇచ్చారు. అభివృద్దే మా ఎజెండా అంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని నిర్మించే బాధ్యత బీజేపీదేననీ, అందరూ సంతోషించే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయనీ అమరావతి రైతులను ఓదార్చారు సోము వీర్రాజు.