అమ్మాయికి మెసేజ్ చేశాడని చిత్రహింసలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలికిపురంకు చెందిన జయసాయి యువరాజు అనే బీసి(రజక) యువకుడు ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడు.అది తెలుసుకున్న కొంతమంది యువకులు(దళిత) ఆ యువరాజుని మాట్లాడుదాం అని కొబ్బరి తోటలోకి రమ్మని పిలిచి దారుణంగా చిత్ర హింసలకు గురి చేశారు. తమ వెంట తెచ్చుకున్న బీరు బాటిల్స్ తో యువరాజు తలపై బలంగా మోది కొట్టారు. రెండు గంటలకు పైగా దాడి చేస్తూనే ఉన్నారు.రిపీట్ అయితే చంపేస్తామని బెదిరించారు. అయితే ఈ విషయాన్ని యువరాజు ..తన కుటుంబీలకు చెప్పలేదు. రెండు రోజుల తర్వాత ఈ ఘటన మొత్తాన్ని వీడియో చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ నోటా ఈ నోటా పాకి … చివరకు బాధితుడైన యువరాజు తల్లిదండ్రుల వరకు చేరింది.దీంతో అప్పటికే తీవ్ర గాయాల పాలై ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న యువరాజుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

