ఉమెన్ చాందీకి నివాళులర్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు
ఇవాళ కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని రాజకీయ,సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే,రాహుల్ గాంధీ ఉమెన్ చాందీకి నివాళులు అర్పించారు. అక్కడ వారు చాందీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఉమెన్ చాందీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి.కాగా ఉమెన్ చాందీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన జీవితకాలమంతా కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా ఉన్నారు.

