ఇవాళ కవిత ఈడీ విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ నోటీసులపై ఆమె మాట్లాడనున్నారు. ఇప్పటికే ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఈడీ కోరగా.. ఆమె అందుకు బదులిచ్చారు. ఈనెల 11న హాజరవుతానని సందేశం పంపించారు. అయితే దీనిపై ఈడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇవాళ, రేపు ముందస్తుగా కార్యక్రమాలను రూపొందించుకున్నానని ఆమె ఈడీకి తెలిపారు. రేపు ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కవిత దీక్షకు దిగనున్నారు. జంతర్ మంతర్ వేదిక వద్ద ఒకరోజు దీక్షకు కవిత ఏర్పాట్లు చేసుకున్నారు. అందువల్ల తాను ఎల్లుండి ఈడీ విచారణకు వస్తానని చెప్పారు.


