Andhra PradeshHome Page SliderPolitics

తిరుపతిలో తొక్కసలాట-మృతుల కుటుంబాలకు భారీ పరిహారం

తిరుపతిలో తొక్కసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది  ప్రభుత్వం. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. బుధవారం రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారి వివరాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి(37) ,ఇదే జిల్లాకు చెందిన కంచ‌ర‌పాలెం వాస్త‌వ్యురాలు శాంతి(35), ర‌జిని(47),ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట‌కు చెందిన బాబు నాయుడు(51),త‌మిళ‌నాడు రాష్ట్రం సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన మ‌ల్లిగ‌(50),ఇదే రాష్ట్రానికి చెందిన పొల్లాచ్చి వాస్తవ్యురాలు నిర్మల‌(45) లు ఈ తొక్కిస‌లాట‌లో మృతి చెందిన‌ట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని టిటిడి మాజీ ఛైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్ రెడ్డి డిమాండ్ చేయగా, ప్రభుత్వం రూ. 25 లక్షలు ప్రకటించింది.