తిరుపతి ఘటన..’డాకు మహరాజ్’ ఈవెంట్‌పై కీలక నిర్ణయం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రభావం బాలకృష్ణ సినిమా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పడింది. ఈ ఈవెంట్‌ను రద్దు చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. అనంతపురంలో జరగాల్సిన ఈ ఈవెంట్‌కు ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడైన నారా లోకేష్ కూడా రావాల్సి ఉంది. ఏపీలో ఈ దుర్ఘటన జరగడంతో ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఇలాంటి ఈవెంట్ జరపడం, మంత్రి అయిన లోకేష్ హాజరు కావడం మంచిది కాదనే ఉద్దేశంతో దీనిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తిరుపతిలో జరిగిన దుర్ఘటన విషయంలో చిత్రబృందమంతా చాలా బాధపడుతోందని, బాధాతప్త హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, అత్యంత గౌరవంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం అంటూ ప్రకటించింది.
BREAKING NEWS: తిరుపతిలో దారుణం..ఆరుగురు మృతి

