భక్తులను ఆశ్చర్యపరుస్తున్న తిరుమలగిరులు..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను అక్కడి ప్రకృతి సౌందర్యం కట్టిపడేస్తోంది. తిరుమల ఘాట్ రోడ్‌లో వ్యూ పాయింట్ల వద్ద మంచు, పొగమంచుతో కూడిన దృశ్యాలు వారిని ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. తిరుపతి నగరం కనిపించకుండా దట్టమైన మేఘాలు కనువిందు చేస్తున్నాయి. తెల్లని మబ్బు తేలుతూ ఆహ్లాదం కలిగిస్తోంది. దీనితో భక్తులందరూ తిరుమల దిగి తిరుపతికి చేరుకునే దారిలో వాహనాలను ఆపి ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. అయితే వాహనాల రాకపోకలకు దట్టమైన పొగమంచు వల్ల ఇబ్బంది కలుగుతోంది.

