కాలమే అన్నింటికీ పరిష్కారం: టీమిండియా కెప్టెన్ రోహిత్ సంచలన వ్యాఖ్యలు
T20 ఇంటర్నేషనల్స్ నుండి ఇటీవలే రిటైర్ అయిన తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్లలో తన ఆట భవిష్యత్‌పై క్లారిటీ ఇచ్చాడు. గత నెలలో రోహిత్ నేతృత్వంలోని టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్‌కు అందించి రిటైర్మెంట్ ఆ ఆటకు ఇక స్వస్తి పలుకుతున్నట్టు చెప్పాడు. ఇటీవల డల్లాస్‌లో జరిగిన డ్యూరీనా ఈవెంట్‌లో రోహిత్‌ను, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడగ్గా అందుకు ఆయన బదులిచ్చాడు. తాను చాలా ముందు రోజుల గురించి ఆలోచించే వ్యక్తిని కాదని చెప్పాడు. “నేను ఇప్పుడే చెప్పాను. నేను అంత ముందుకు వెళ్లను. కాబట్టి స్పష్టంగా, నేను కొంతకాలం ఆడటం మీరు చూస్తారు” అని రోహిత్ చెప్పాడు. అంటే కాలం ఎలా డిసైట్ చేస్తే తాను ఆట ఆవిధంగా ఆడతానని చెప్పాడు.

159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులతో రోహిత్ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (ఐదు) సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. రెండు T20 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2007లో తొలిసారి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, 2024లో కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత, రోహిత్, విరాట్ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. అయితే రోహిత్ వన్డేలు, టెస్టులలో నాయకత్వం వహించనున్నాడు.

