Home Page SliderTelangana

టిల్లు స్వ్కేర్  రిలీజ్ ఎప్పుడంటే

గత సంవత్సరం డిజే టిల్లుతో ఆకట్టుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు స్వ్కేర్ చిత్రం త్వరలో రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. థియేటర్లలో ఈ చిత్రం సెప్టెంబరు 15 న రాబోతోందని ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో రాధిక రోల్‌లో మళయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. డీజే టిల్లులో రాధిక పాత్ర ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సీక్వెల్‌లో  అనుపమ నటిస్తుండడంతో యూత్‌కి ఇంకా ఆసక్తి పెరిగింది. చాలా వెరైటీగా తెలంగాణా యాసలో మాట్లాడుతూ సిద్దు చాలా సందడిగా నటించాడు. ఈ సీక్వెల్ చిత్రం మొదటి భాగానికి మించి వినోదాన్ని పండిస్తుందని చిత్రబృందం హామీ ఇస్తూ ఒక రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గాయకుడు రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.