బీజేపీ కార్యకర్తపై దుండగుల అటాక్
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్న అతడిపై మోతె బైపాస్ వద్ద కారులో వచ్చిన నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లతో గాయపర్చి తాను చనిపోయాడనుకొని అక్కడి నుంచి పారిపోయారని బాధితుడు తెలిపాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

