ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పంట పొలంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి శివారులో జరిగింది. రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వీరంతా మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చే