Home Page SliderTelangana

ఇకపై కాలేజీల్లో విద్యార్థులను వేదిస్తే..అంతే సంగతులు

Share with

తెలంగాణాలో ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది.  దీని ప్రకారం ప్రైవేటు కాలేజీల్లో ఇకపై సాయంత్రం తరగతులు నిర్వహించవద్దు అని తెలిపింది.  అంతేకాకుండా కాలేజీల్లో స్టడీ అవర్స్ కూడా రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్ బోర్డు సూచించింది.  హస్టల్ విద్యార్థులకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని, రాత్రి భోజనం తర్వాతే ప్రత్యేక క్లాసులు,టెస్టులు పెట్టాలని పేర్కొంది. కాలేజీల్లో లెక్చరర్స్ ఇకపై విద్యార్థులను తిట్టినా,హేళన చేసిన కేసులు నమోదు చేస్తామని ప్రైవేటు కాలేజీలను ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఇంటర్ బోర్డు దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది.