షారుఖ్ ఖాన్‌కు కూడా బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు బెదిరింపుల బెడద తప్పలేదు. ముంబయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్స్ ఛత్తీస్‌ఘడ్ నుండి వచ్చినట్లు గుర్తించారు. ఫైజాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్‌ను కనిపెట్టారు పోలీసులు. మరో సహనటుడు సల్మాన్‌ఖాన్‌పై ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో షారుఖ్ ఖాన్ విషయంలో అప్రమత్తమవుతున్నారు పోలీసులు.

